Saturday, November 23, 2024

హిజాబ్ వ్య‌వ‌హారం-భ‌ద్ర‌తా బ‌ల‌గాలు జ‌రిపిన అణిచివేత‌లో 50మంది పౌరులు మృతి

హిజాబ్ ధ‌రించ‌లేద‌న్న కార‌ణంతో మాసా అమీని అనే 22ఏళ్ల యువ‌తిని టెహ్రాన్ పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే కస్టడీలో తీవ్రంగా గాయపడిన ఆమె.. దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటన దేశవ్యాప్త నిరసనలకు దారితీసింది. పోలీసులు చిత్రహింసలతోనే మాసా అమీని మరణించిందని ప్రజలు రోడ్లపైకి వచ్చి హిజబ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. క్రమంగా ఇవి దేశంలోని 80 పట్టణాలు, నగరాలకు విస్తరించాయి. అయితే మహిళల నిరసనను అడ్డుకునేందుకు పోలీసులు పెద్దసంఖ్యలో భద్రతా బలగాలను మోహరించారు. టియర్‌ గ్యాస్‌, పెప్పర్‌ స్ప్రేలను ప్రయోగించి ఆందోళనలను అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో భద్రతా బలగాలు జరిపిన అణిచివేతలో ఇప్పటివరకు కనీసం 50 మంది పౌరులు మరణించారని ఓస్లో కేంద్రంగా పనిచేస్తున్న ఇరాన్‌ మానవ హక్కుల సంస్థ వెల్లడించింది. అయితే ప్రభుత్వం 17 మంది మాత్రమే చనిపోయారని చెబుతుంది.కానీ దానికి మూడు రెట్లు అధికంగా మరణాలు ఉన్నాయని తెలిపింది. ఇందులో ఐదుగురు భద్రతా సిబ్బంది కూడా ఉన్నారని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement