Tuesday, November 26, 2024

మ‌ళ్లీ హిజాబ్ వివాదం – ఈసారి ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో

మ‌ళ్లీ హిజాబ్ వివాదం తెర‌పైకి వ‌చ్చింది. ఈసారి ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. అలీఘర్‌లోని ఒక ప్రముఖ కళాశాల కొత్త ఉత్త‌ర్వులు జారీ చేసింది. అందులో క్యాంపస్‌లోకి సూచించబడిన యూనిఫాం లేకుండా విద్యార్థుల ప్రవేశాన్ని నిషేధిస్తున్న‌ట్టు పేర్కొంది. హిజాబ్ ధరించి ఉన్న ముస్లిం బాలికలకు ప్రవేశాన్ని నిరాకరించింది. క్లాస్‌కు హాజరవుతున్నప్పుడు ముఖాన్ని కప్పుకోవద్దని, హిజాబ్ ధ‌రించ‌వ‌ద్ద‌ని అలీఘ‌ర్ లోని శ్రీ వ‌ర్షిణీ కాలేజీ విద్యార్థుల‌కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో మ‌రోసారి హిజాబ్ వ్య‌వ‌హారం చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. హిజాబ్ ధ‌రించిన విద్యార్థుల‌కు ప్రవేశం నిరాకరించడంతో పలువురు విద్యార్థులు ఇంటికి చేరుకున్నారు. సిబ్బంది తనను లోపలికి అనుమతించలేదని మీడియాతో అన్నారు. ఆ కాలేజీలో BA మొదటి సంవత్సరం చ‌దువుతున్న ఓ విద్యార్థిని మాట్లాడుతూ.. ఇప్పుడు, నేను ఇంటికి తిరిగి వస్తున్నాను. ఎందుకంటే హిజాబ్ ధ‌రించిన వారిని కాలేజీ క్యాంప‌స్ లోకి అనుమ‌తించ‌డం లేదు అని తెలిపింది. బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్న మరో విద్యార్థిని మాట్లాడుతూ.. క్యాంపస్‌లోకి ప్రవేశించే సమయంలో తాను ధరించిన బురఖాను తొలగించాలని కళాశాల అధికారులు మొదట అడిగారని, ఆ తర్వాత హిజాబ్‌ను కూడా తొలగించాలని కోరారు. “నేను గౌరవప్రదంగా కళాశాలలో ప్రవేశించాను. మా హిజాబ్‌తో వారికి ఎందుకు సమస్య ఉందో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను” అని ఆ విద్యార్థిని చెప్పింది. “నేను హిజాబ్ లేకుండా ఎక్కడికీ వెళ్ళడానికి సిద్ధంగా లేను .. కళాశాల మమ్మల్ని ఇకపై క్యాంపస్‌లోకి ప్రవేశించడానికి అనుమతించదని పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement