టీ.పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉద్రిక్తత నెలకొంది. రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎర్రవల్లికి బయలుదేరిన రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. రేవంత్ ఇంటికి కాంగ్రెస్ శ్రేణులు భారీగా చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో మాజీ ఎంపీ మల్లు రవిని పోలీసులు తోసివేయడంతో ఆయన కిందపడ్డారు. దీంతో రవి అనుచరులు పోలీసులతో వాగ్వవాదం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తుందా.. లేదంటే ప్రజాస్వామ్యం నడుస్తోందా? అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి ప్రశ్నించారు. ఎర్రవల్లి గ్రామంలో రైతులతో రచ్చబండ కార్యక్రమం ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రచ్చబండ కార్యక్రమాలు జరుగుతున్నాయన్న మల్లు రవి.. టీఆర్ఎస్, బీజేపీ వీధి నాటకాలు అడుతున్నాయని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ ముట్టడి అని తాము చెప్పలేదన్నారు. కేసీఆర్ 150 ఎకరాల్లో వరి వేశారు అని తాము చెప్పామన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతల హౌస్ అరెస్ట్‌లను తీవ్రంగా ఖండిస్తున్నామని మల్లు రవి పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..