హైదరాబాద్లోని ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ఇవ్వాల (బుధవారం) సాయంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, పలు శాఖల ఉన్నతాధికారులతో పాటు హైదరాబాద్, సైబరాబాద్ సీపీలు సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై కేసీఆర్ చర్చించినట్టు సమాచారం. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న సీఎం కేసీఆర్.. నేరుగా అధికారులతో భేటీ అయినట్టు తెలుస్తోంది.
ఇక.. యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు హాజరైన సీఎం కేసీఆర్, అటునుంచి అటే ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేసీఆర్ పలువురు రైతు సంఘాల నేతలు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, ఎంపీలతో చర్చలు జరిపారు. బీఆర్ఎస్, టీఆర్ఎస్ కార్యాలయాల పనులను పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖతో కూడా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పరిపాలన, ప్రభుత్వ పథకాల ప్రచారం, నిధుల సమీకరణపై సీఎస్ సోమేశ్ కుమార్తో హస్తినలోనే సీఎం సమీక్షించారు.