హైదరాబాద్‌లో పబ్ కల్చర్ పెరుగుతోంది. అర్ధరాత్రి దాకా తాగుతూ, విపరీతమైన లౌడ్ స్పీకర్ల సౌండ్స్ మధ్య డ్యాన్సులు చేస్తుంటారు. అయితే.. ఇది వారికి ఎంజాయ్ మెంట్ అనిపించినా.. మిగతా వారికి ఆసహ్యంగా ఉంటోంది. విపరీతమైన సౌండ్స్‌తో వాహనదారులు, చుట్టుపక్కల వారు ఇబ్బందికి గురవుతున్నారు. దీంతో హైకోర్టు ఇవ్వాల పబ్‌ల తీరుపై మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. రాత్రివేళ ఎట్లాంటి సౌండ్ సిస్టమ్స్‌కి అనుమతి లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఎక్సైజ్ రూల్స్ ప్రకారం ఇళ్లు, విద్యాసంస్థలు ఉన్న ప్రదేశాల్లో పబ్‌లకు ఎలా అనుమతిస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.
అందులో భాగంగా.. ఇవ్వాల్టి రాత్రి 10 గంటల నుంచి పబ్స్‌లో ఎట్లాంటి సౌండ్స్ రావొద్దని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. సిటీ పోలీస్ యాక్ట్, నాయిస్ పొల్యూషన్ రెగ్యులేషన్స్ ప్రకారం ఈ నిబంధనలు పాటించాలని ఆర్డర్స్ ఇచ్చింది.