జగన్ సర్కార్ కు మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. టికెట్ల రేట్లు తగ్గిస్తూ ఇచ్చిన జీవో నెం.35ను ఏపీ హైకోర్టు సస్పెండ్ చేసింది. పాత విధానంలో టికెట్ల రేట్లు నిర్ణయించేందుకు పిటిషనర్లకు వెసులుబాటు కల్పించింది. టికెట్ రేట్లను తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ థియేటర్ యజమానులు హైకోర్టు ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ప్రభుత్వం జీవో ఇచ్చిందని వివరించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనది కాదని, కొత్త సినిమాలు విడుదలైన సమయంలో టికెట్ రేట్లు పెంచుకునే హక్కు థియేటర్ యజమానులకు ఉంటుందని పిటిషన్లు పేర్కొన్నారు. దీనిపై ఈరోజు హైకోర్టులో వాదనలు జరిగాయి. టికెట్ రేట్లు తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదని విన్నవించారు. పిటిషనర్ తరపు న్యాయవాదులు చేసిన వాదనలతో కోర్టు ఏకీభవించింది. దీంతో ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.35ను సస్పెండ్ చేస్తున్నట్లు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాత పద్దతుల్లోనే ఏపీలో సినిమా టికెట్ల రేట్లు ఉండనున్నాయి.
Breaking : జగన్ సర్కార్ కు హైకోర్టు షాక్ : సినిమా టికెట్లపై జీవో సస్పెండ్
Advertisement
తాజా వార్తలు
Advertisement