తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. రేపటితో ప్రభుత్వం విధించిన నైట్ కర్ఫ్యూ ముగియనుండటంతో తర్వాత చర్యలు ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం శుక్రవారం నాడు పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని కోర్టుకు వివరణ ఇచ్చింది. చివరి నిమిషంలో నిర్ణయాలు తీసుకోవడం ఎందుకని, నియంత్రణ చర్యలపై దాగుడు మూతలెందుకు అని ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. కనీసం ఒక రోజు ముందు చెబితే నష్టమేంటని ప్రశ్నించింది. నియంత్రణ చర్యలపై తాము ఎలాంటి సూచనలు ఇవ్వడం లేదని, క్షేత్రస్థాయి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలంటూ హైకోర్టు సూచించింది. కాగా ప్రభుత్వాన్ని సంప్రదించి మధ్యాహ్నంలోగా సమాధానం చెప్తామని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హైకోర్టుకు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement