Tuesday, November 26, 2024

పీఆర్సీ పిటిష‌న్ పై హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో పీఆర్సీ పిటిష‌న్‌పై హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన జీవోపై ఉద్యోగ సంఘాల నేత‌లు హైకోర్టుల‌ను ఆశ్ర‌యించిన విష‌యం విదిత‌మే. అయితే ఈరోజు హైకోర్టు విచార‌ణ‌కు స్వీక‌రించింది. పీఆర్సీ జీవోపై సమ్మెకు వెళ్లేందుకే ఉద్యోగ సంఘాలు..సుముఖంగా ఉన్నాయి. ఈ క్రమంలో..హైకోర్టులో దాఖలైన ఈ పిటిషన్లపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్ విచారించే రోస్టర్ లో తమ బెంచ్ లేదని న్యాయస్థానం పేర్కొంది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం, వ్యక్తిగత పిటిషన్ అవటంతో దీనిపై నిర్ణయం తీసుకునే అధికారం తమకు లేదని వ్యాఖ్యానించింది. న్యాయస్థానం అందుకే ఈ పిటిషన్ సీజే కి పంపుతున్నామని న్యాయమూర్తి వెల్లడించారు. ఈ పిటిషన్ ఏపీలో ఉన్న అందరి ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని తెలిపింది. అయితే అంతకుముందు జరిగిన విచారణలో స్టీరింగ్‌ కమిటీలోని 12 మంది సభ్యులు కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement