తెలంగాణలోనే కాదు ఆసియా ఖండంలోనే అత్యంత పెద్దదిగా పేరుగాంచిన ఆదివాసి జాతర అయిన మేడారం సమ్మక్క, సారక్క జాతర ఈ ఏడాది జరుగనుంది. ఈ జాతర ఈ ఏడాది ఈ ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు ఈ జాతర జరగనుంది. దీని కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) నిర్ణయించింది.
సమక్క, సారక్క జాతర కు భక్తులు భారీగా తరలిరానున్నారు. ఈక్రమంలో కోవిడ్ వ్యాప్తి విస్తృతంగా జరిగే అవకాశముంది.దీంతో తీసుకోవాల్సిన చర్యల విషయంలో ధర్మాసనం ప్రభుత్వానికి..జాతర నిర్వహించే క్రమంలో నిబంధనల గురించి ప్రత్యేకించి సూచనలు చేసింది. మేడారం జాతర నిర్వహణలో కోవిడ్ నిబంధనల అమలు గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు పలు కీలక సూచనలు చేసింది. ఈ జాతర నిర్వహించడంలో భాగంగా కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని, ఇది ప్రస్తుత కోవిడ్ వ్యాప్తి పరిస్థితుల్లో అత్యంత అవశ్యకమని..కచ్చితంగా కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి రెండు వారాల్లో సమగ్ర నివేదికను ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..