దేవరయాంజల్ భూములపై ఎప్పటినుంచో ఉన్న వివాదంపై ఇప్పుడే ఇంత తొందరగా విచారణ ఎందుకు చేస్తున్నారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రజలు కరోనాతో మరణిస్తుంటే లేని స్పందన… ఈ అంశంపై ఎందుకని వ్యాఖ్యానించింది. దేవరయాంజాల్ భూముల పై ఈనెల 3న జారీ చేసిన జీవో 1014 జీవోను సవాల్ చేస్తూ సత్యనారాయణరెడ్డి కుటుంబసభ్యులు దాఖలు చేసిన అత్యవసర పిటిషన్ ను హైకోర్టు ఇవాళ విచారించింది. దేవరయాంజాల్ భూముల్లో ప్రభుత్వం జోక్యం వద్దని పిటిషనర్లు కోరారు. ఈ సందర్బంగా హైకోర్టు.. కరోనా సమయంలో ఇంత హడావుడిగా విచారణ అవసరమా? అని ప్రశ్నించింది. ‘’నలుగురు అధికారులతో ఇప్పడు కమిటీ ఎందుకు? మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా జీవోలు ఇస్తారా?’’ అంటూ హైకోర్టు నిలదీసింది. మిగిలిన ఆలయ భూముల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement