Wednesday, November 20, 2024

High Alert: కేరళలో బర్డ్ ఫ్లూ కలకలం..

కేర‌ళలో బ‌ర్డ్ ఫ్లూ మరోసారి పంజా విసురుతుంది. దేశంలో ఒవైపు కరోనా.. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళన కలిగిస్తున్న వేళ.. కేరళలో బ‌ర్డ్ ఫ్లూ బయటపడటం అలజడి రేపుతోంది. కేర‌ళలోని అల‌ప్పుళ జిల్లాలోని త‌కాజిలో బర్డ్ ఫ్లూ వైర‌స్ ను వైద్య అధికారులు గుర్తించారు.

ఫ్లూ ప్రభావిత ప్రాంతాల నుండి ఒక కి.మీ పరిధిలో ఉన్న బాతులు, కోళ్ళు, ఇతర పెంపుడు పక్షులను చంపాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించింది. అలాగే ఆ చుట్టు ప‌క్క‌ల ప్రాంతాల‌లో మాంసం అమ్మ‌కాలపై నిషేధం విధించారు. జ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించేందుకు జిల్లా కలెక్టర్ ఎ అలెగ్జాండర్ అధ్యక్షతన గురువారం జిల్లాకు చెందిన పశుసంవర్ధక, ఆరోగ్య, పోలీసు శాఖల ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఫ్లూ వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి తకజీ గ్రామ పంచాయతీలో అధికారులు చర్యటు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement