కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రబలుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పలు జాగ్రత్తులు సూచించింది. కరోనా గైడ్ లైన్స్ జారీచేస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ అన్ని రాష్ట్రాలకు ఈరోజు లేఖ రాసింది. వీటిని తప్పకుండా వెంటనే అమల్లోకి తీసుకురావాలని తెలిపింది. విదేశీ ప్రయాణికులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించింది. తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలని ఆదేశించింది. కరోనా టెస్టుల సంఖ్య పెంచాలన్న కేంద్రం.. కంటైన్మెంట్ జోన్ లు కూడా కఠినంగా అమలు చేయాలని తెలిపింది. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం శాంపిల్స్ ను వెంటనే పంపాలని పేర్కొంది. కాగా, కొత్త వేరియంట్ ప్రభావిత దేశాల నుంచి విమాన రాకపోకలను నిలిపివేయాలని.. కరోనా ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రధాని మోడీకి లేఖ రాశారు.
ఇప్పటికే దక్షిణాఫ్రికా నుంచి పలు దేశాలకు ఒమిక్రాన్ వ్యాపిస్తోంది. బెల్జియం, హాంకాంగ్, ఇజ్రాయెల్, బోట్స్ వానా, జర్మనీ, బ్రిటన్, ఇటలీలో కొత్త వేరియంట్ ను గుర్తించారు. ఈ క్రమంలో ఒమిక్రాన్ వేరియంట్ పై ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. విదేశీయులకు ఆర్ టీ పీ సీ ఆర్ తప్పనిసరి చేసింది బ్రటిన్ ప్రభుత్వం. దక్షిణాఫ్రికా, బోట్స్ వానా, జింబాబ్వే, నమీబియా, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, సింగపూర్, జపాన్, శ్రీలంక, పాకిస్తాన్ దేశాలు ప్రయాణికులకు పలు ఆంక్షలు విధించాయి..
అమెరికాలో రేపటి నుంచి మరిన్న ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. దక్షిణాఫ్రికా నుంచి వచ్చే విమానాలను 14 రోజుల పాటు సస్పెండ్ చేస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రభుత్వం తమ దేశ సరిహద్దులను క్లోజ్ చేసింది.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..