Friday, November 22, 2024

హైటెక్ సెక్యూరిటీ: అమెరికాలో ఉండి.. యూపీలో దోపిడీని అడ్డుకున్నాడు

అతనో సాఫ్ట్వేర్ ఇంజినీర్.. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాడు. తన సొంతూరేమో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. అయితే తన ఫోన్కు ఆ ఇంట్లో అమర్చిన హైటెక్ సెక్యూరిటీ సిస్టమ్ని లింక్ చేసుకున్నాడు. కాగా, దానికి ఇక అలర్ట్ నోటిఫికేషన్ రావడంతో యూఎస్లో ఉన్న అతను ఉత్తరప్రదేశ్లోని ఇంట్లో దొంగతనం జరగకుండా కాపాడుకున్నాడు. ఈ హై సెక్యూరిటీ వార్త ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఇంటిని దోపిడీ నుండి హైటెక్ సెక్యూరిటీ ఎలా కాపాడుతుంది..
ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం కాన్పూర్‌లో నివసిస్తున్న విజయ్ మిశ్రా అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఇంటిపై మొన్న అర్థరాత్రి కొందరు దొంగలు దాడి చేశారు. అయితే మోషన్ సెన్సార్ కెమెరాలు అమర్చడం ద్వారా ఆ ఇంటి చుట్టూ ఏవో కదలికలు గుర్తించి తన ఫోన్‌లో అలర్ట్ వచ్చింది. అప్పుడు ‘‘నేను అమెరికాలో డిన్నర్ చేస్తున్నా” అని విజయ్ మిశ్రా చెప్పాడు. మొదట్లో అతనికి వచ్చిన కొన్ని హెచ్చరికలను పట్టించుకోలేదు. అది తన ఇంటి వెలుపల కార్ల కదలిక కారణంగా కావచ్చునని భావించాడు. కొద్దిసేపట్టి తర్వాత హెచ్చరికలు ఆగకపోవడంతో అతను తన ఫోన్‌లోని లైవ్ టెలీకాస్ట్ ద్వారా విజువల్స్ ను చూశాడు. అతని ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న దొంగను చూసి షాక్ అయ్యాడు.

‘‘అవుట్‌గోయింగ్ వాయిస్ ఆప్షన్‌ని అందించే నా సెక్యూరిటీ సిస్టమ్ ద్వారా అతనితో మాట్లాడటానికి ప్రయత్నించాను. కానీ ఆ దొంగ స్పందించలేదు’’ అని విజయ్ చెప్పాడు. సీసీటీవీ వైర్లను కత్తిరించిన తర్వాత కూడా విజయ్ కెమెరాలను విద్యుత్‌తో పాటు బ్యాటరీతో కనెక్ట్ చేయడంతో దొంగకు తను మాట్లాడింది వినబడింది. విజయ్ అప్పుడు USలో నివసిస్తున్న అతని సోదరుడు అశుతోష్‌ను అప్రమత్తం చేశాడు. ఆ తర్వాత స్థానిక పోలీసులు, పొరుగువారు, స్థానికంగా ఉండే ఫ్రెండ్ని సంప్రదించడానికి ప్రయత్నించాడు. దాంతో అతని ఫ్రెండ్ ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు ఫోన్ చేశాడు.

కాన్పూర్ పోలీసులను అప్రమత్తం చేయడంతో..
తను ఫోన్ చేయగానే అలర్ట్ అయిన కాన్పూర్ పోలీసులు నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడి పోలీసుల పనితీరు బాగుందని అశుతోష్ చెప్పాడు. తమ అంచనాలకు మించి పోలీసులు రెస్పాండ్ అయ్యారన్నాడు. దొంగలతో ఎన్‌కౌంటర్ జరుగుతున్నప్పుడు కూడా వారు కుటుంబ సభ్యులతో సమన్వయం చేసుకున్నారు. పోలీసులు మా కోసం అన్ని తాళాలు కూడా తనిఖీ చేశారని, తప్పించుకోగలిగిన దొంగలందరినీ పట్టుకున్నారని అశుతోష్ తెలిపారు. మిశ్రా సోదరులు మాట్లాడుతూ.. దొంగ ముఖం తమకు బాగా తెలిసినట్లుగా ఉందని, ఆయుధాలు, తుపాకులతో వచ్చినందున ఇదేదో పెద్ద గ్యాంగ్ దోపిడీ ముఠాగా అనుమానిస్తున్నారని చెప్పారు. విజయ్, అశుతోష్ ఇద్దరూ మీడియా కూడా త్వరగా స్పందించి లైవ్ కవరేజీ ఇవ్వడానికి ప్రయత్నించిందని కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఈ హైటెక్ సెక్యూరిటీ సిస్టమ్‌ను US నుండి ప్రత్యేకంగా కొనుగోలు చేశామని, దీని కారణంగా దోపిడీ జరగకుండా కాపాడుకున్నట్టు బాధితులు తెలిపారు.

- Advertisement -

ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement