Thursday, November 21, 2024

బాలీవుడ్ లో హీరోయిజం క‌రువైంది – ‘చిరంజీవి’తో ప‌ని చేయ‌డం అద్భుతం – స‌ల్మాన్ ఖాన్

బాలీవుడ్ చిత్రాల్లో హీరోయిజం క‌రువైంద‌ని స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ సంచ‌ల‌న‌వ్యాఖ్య‌లు చేశాడు. దక్షణాది సినిమాల్లో ఉండే హీరోయిజమే ప్రేక్ష‌కుల‌ను థియేటర్ల‌కు రప్పిస్తుంద‌న్నారు. ద‌క్షిణాది ర‌చ‌యిత‌లు, ద‌ర్శ‌కులు బాగా కష్ట‌ప‌డ‌తారని. అక్క‌డి చిత్రాల‌న్ని హిందీలో రీమేక్ అవుతున్నాయి. మ‌న క‌థ‌లు కూడా వారు తీసుకునే రోజు రావాల‌ని పేర్కొన్నాడు. స‌ల్మాన్ ఖాన్ ప్ర‌స్తుతం ‘టైగ‌ర్’ పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ ప‌నుల‌లో బిజీగా ఉన్నాడు. తెలుగులో చిరంజీవితో కలిసి ‘గాడ్‌ఫాద‌ర్’ సినిమాలో కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఇటీవ‌లే చిరంజీవి, స‌ల్మాణ్ మ‌ధ్య స‌న్నివేశాలు జ‌రిగాయి. మోహన్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌ ఈ చిత్రం మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ట‌యిన ‘లూసీఫ‌ర్‌కు’ రీమేక్‌గా తెర‌కెక్క‌నుంది. తాజాగా ‘ఐఫా’ ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌లో ‘ఆర్ఆర్ఆర్’, ‘గాడ్ ఫాద‌ర్’ సినిమాల‌ గురించి స‌ల్మాన్ ఖాన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. స‌ల్మాన్ ఖాన్ మాట్లాడుతూ “గాడ్‌ఫాద‌ర్ సినిమాలో చిరంజీవితో పనిచేయ‌డం అద్భుత మైన ఎక్స్‌పీరియెన్స్ అని. చిరంజీవి ఎప్ప‌టినుంచే ప‌రిచ‌యం ఉన్న వ్య‌క్తి, తన‌కు అత్యంత స‌న్నిహితుడ‌ని, అలాగే రామ్‌చ‌ర‌ణ్ కూడా త‌న‌కు ఫ్రెండ్ అని చెప్పుకొచ్చాడు. ‘ఆర్ఆర్ఆర్‌’లో రామ్‌చ‌ర‌ణ్ అద్భుతంగా న‌టించాడ‌ని, చ‌ర‌ణ్ చూస్తే నాకు చాలా గ‌ర్వంగా ఉందని పేర్కొన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement