Saturday, November 23, 2024

తాప్సీ పెళ్ళి పీట‌లు ఎక్క‌నుందా !

బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లు చేస్తూ బిజీగా ఉంది న‌టి తాప్సీ. చాలా రోజుల త‌ర్వాత తెలుగులో ఓ మూవీ చేయ‌నుంది. ఆ చిత్ర‌మే మిష‌న్ ఇంపాజిబుల్ స్వరూప్ ఆర్ఎస్జే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నిరంజన్ రెడ్డి అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 1న ఈ చిత్రం రిలీజ్ కానుందని మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. తాప్సీ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతోందట. బ్యాడ్మింటన్ ఆటగాడు మాథియాస్ బోతో తాప్సీ ఎప్పటినుంచో ప్రేమాయణం నడుపుతున్న సంగతి తెలిసిందే. సోదరి షగున్ పన్ను ద్వారా మాథియాస్ బో తాప్సీకి పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. వీరి ప్రేమను పెద్దలు కూడా ఆంగీకరించారు. అయితే వీలు చిక్కినప్పుడల్లా వెకేషన్లకు చెక్కేసే తాప్సీ-మాథియాస్లు.. ఇప్పుడు పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాలని నిశ్చయించుకున్నారట. దీంతో కుటుంబసభ్యులు వీరి వివాహానికి డేట్ కూడా ఫిక్స్ చేశారని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement