సోమి అలీ బాలీవుడ్ పై ఇంట్రెస్ట్ తో ముంబైకి వచ్చింది. ఈమె స్వస్థలం పాకిస్థాన్ లోని కరాచీ. కాగా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తో ఆమె కొన్ని రోజులు లవ్ లో ఉంది. బులంద్ చిత్రంతో ఆమె హీరోయిన్ గా మారింది. కానీ ఆ మూవీ రిలీజ్ కాలేదు. 1994లో విడుదలైన అంత్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. 1997 వరకు బాలీవుడ్ లో వరుసగా చిత్రాలు చేశారు సోమి అలీ. 1997లో విడుదలైన ‘చుప్’ ఆమె చివరి చిత్రం. రీసెంట్ గా మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న సోమి అలీ (Somy Ali)… పాకిస్థాన్ కి చెందిన కొందరు మగవాళ్ళు నన్ను చంపేస్తామంటూ బెదిరింపు మెయిల్స్ పంపిస్తున్నారు.
దీనికి కారణం తను నడిపిస్తున్న ‘నో మోర్ టియర్స్’ ఎన్‌జీవో అని ఆమె తెలిపారు. సోమి అలీ ‘నో మోర్ టియర్స్’ స్వచ్ఛంద సంస్థ ద్వారా మానవ అక్రమ రవాణా బాధితుల్ని కాపాడుతూ ఉంటుంది. ముఖ్యంగా గే విక్టిమ్స్‌కి సోమీ చట్టపరమైన రక్షణ కల్పించటంలో ముందుంటుంది. అదే చాలా మంది కోపానికి, ప్రతీకారానికి కారణమట. దీంతో ‘నువ్వు ఎప్పుడు పాకిస్తాన్ వచ్చినా వదిలిపెట్టెదే లేదు. నిన్ను చంపి తీరుతాం’ అంటూ తరచూ అక్కడి పురుషుల నుంచి తనకు మెయిల్స్ వస్తుంటాయని, అందుకే తాను కొన్నేళ్లుగా పాక్‌కు వెళ్లడం లేదని సోమి స్పష్టం చేసింది . అక్కడికి వెళితే తనకు ప్రాణ గండం తప్పదని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..