నటులు నాగచైతన్య.. సమంత ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తెలుగు సంప్రదాయంలో వీరిద్దరి పెళ్లి ఘనంగా జరిగింది. అయితే నిజానికి సమంత తల్లిదండ్రులకి ఈ పెళ్లి ఇష్టం లేదని.. అప్పట్లో అంతా అనుకున్నారు.
తన తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా… సమంతనే బలవంతంగా వాళ్లని ఒప్పించి..పెళ్లి చేసుకుందన్న ఓ వార్త అప్పట్లో సంచలనంగా మారింది. పెళ్లైన తర్వాత కొన్నాళ్ల పాటు.. హ్యాపీగానే ఉన్న జంట.. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. గతేడాది విడిపోతున్నామని ప్రకటించి అందరకీ షాక్ఇచ్చారు.
కొన్ని మనస్పర్ధలు కారణంగా..కొద్ది నెలల క్రితమే విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే , వీళ్ల మధ్య ఉన్న ప్రాబ్లమ్ ఏంటి అనే సంగతి మాత్రం చెప్పలేదు. దీంతో అనేక రకాల వార్తలు తెరపైకి వచ్చాయి.. వీళ్ల విడాకుల టైంలో నాగార్జున కూడా చేతులెత్తేశాడు అన్న కామెంట్స్ ఎక్కువుగా వినిపించాయి. ‘వాళ్ళ లైఫ్ వాళ్ల ఇష్టం. ఇలా జరిగి ఉండకూడదు. మనం ఏం చేద్దాం. సమంత విడిపోయిన ఎప్పటికి మా ఇంటి బిడ్డ నే ‘అంటూ చెప్పుకొచ్చాడు. మరో పక్క సమంత పేరంట్స్ కూడా..’మా బిడ్డ తీసుకున్న డేసీషన్స్ పై మాకు నమ్మకం ఉంది’ అంటూ సమంత కే సపోర్ట్ చేశారు. సమంత కూడా విడాకుల తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ బిజీగా మారింది. మరోవైపు తాజాగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది. అదే…అక్కినేని నాగార్జున తన ఇంటి మాజీ కోడలు అయిన సమంత వాళ్ళ నాన్నను మీట్ అయ్యిన్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దాదాపు గంట సేపు వీళ్లు మాట్లాడుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా సమంత-చైతన్య భవిష్యత్తు గురించే అంటూ టాక్ వినిపిస్తుంది. మరి దీనిపై నాగార్జున కీలక ప్రకటన ఏమైనా చేస్తారా అనేది వేచి చూడాల్సిందే.సమంత అక్కినేని కుటుంబంతో చాలా బాగా కలిసిపోయింది. మామ నాగార్జునను కూడా ఆట పట్టిస్తూ చాలా సందర్బాల్లో కనిపించింది. అంత బాగా ఉందన్న టైంలో సామ్ చైతూ విడాకులు తీసుకొని అందరికీ షాక్ ఇచ్చారు.
సమంత తండ్రితో భేటీ అయిన నాగార్జున
Advertisement
తాజా వార్తలు
Advertisement