టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత విడాకులు తీసుకుని నాశనమైన ఓ సెకండ్ హ్యాండ్ ఐటమ్ అని ఓ నెటిజన్ దారుణంగా ట్రోల్ చేశాడు. అంతటితో ఆగలేదు. ఓ జెంటిల్మన్ నుంచి అప్పనంగా రూ.50 కోట్లు దోచుకుందని తీవ్ర ఆరోపణ చేశాడు. దీనిపై సమంత స్పందించింది. నీ ఆత్మను దేవుడు దీవించుగాక అంటూ వ్యాఖ్యానించింది సమంత. ఈ సందర్భంగా నెటిజన్లలో అత్యధికులు సమంతకు మద్దతుగా నిలిచారు. ఇలాంటి కామెంట్లకు స్పందించడం అనవసరం అని, తామంతా సమంతకు బాసటగా ఉంటామన్నారు. సమంత ఇలాంటి దుష్ప్రచారాన్ని పట్టించుకోకుండా సినిమాలపై దృష్టి సారించాలని పలువురు సూచించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..