గోల్డెన్ పీకాక్ అవార్డు గురించి మీకు తెలుసా..యునైటెడ్ అరబ్ ప్రభుత్వం ప్రకటించే అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారం గోల్డెన్ పీకాక్. కాగా ఈ అవార్డుని ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసనకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రకటించింది. ఈ అవార్డును ఇప్పటికే ఇండియాలో చాలామంది సొంతం చేసుకున్నారు.కాగా ఇండియా నుండి బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ మొదటిగా ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. గతంలో ఎంతో మంది మలయాళ నటులు ఈ అవార్డును అరబ్ ఎమిరేట్స్ ప్రకటించింది. కాగా ఈ గోల్డెన్ పీకాక్ అవార్డును హీరోయిన్ అమలాపాల్ కు ఇస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.
ఇప్పటివరకు గోల్డెన్ పీకాక్ అవార్డు పొందిన అతి తక్కువ మంది జాబితాలో అమలాపాల్ చేరింది. ఈ అత్యంత అరుదైన అవార్డు దక్కించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అమలాపాల్ తెలిపింది. భారతదేశంలో అతి తక్కువ మందికి ఇచ్చినటువంటి ఈ గోల్డెన్ పీకాక్ అవార్డు సొంతం చేసుకోవడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నట్లు అమలాపాల్ పేర్కొంది. ఈ అత్యంత అరుదైన గోల్డెన్ పీకాక్ పురస్కారాన్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం ప్రతి ఏటా ప్రకటిస్తుంది. ఇప్పటికే భారత దేశంలో కొంత మందికి ఈ అవార్డు ఇచ్చింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..