Friday, November 22, 2024

144మంది ప్రాణాలు కాపాడి – క‌న్నుమూసిన ట్రైన్ డ్రైవ‌ర్

ఓ ట్రైన్ డ్రైవ‌ర్ 144మంది ప్రాణాలు కాపాడి ఆయ‌న క‌న్నుమూశారు. చైనాలో ఈ సంగ‌ఘ‌ట‌న జ‌రిగింది. అది బుల్లెట్ రైలు.
ఇంతలో అకస్మాత్తుగా ఒక జర్క్. ఆ డ్రైవర్ ఏదో కీడు శంకించాడు. రైలు పట్టాల్లో లోపం ఉందని పసిగట్టాడు. అంతే, తన చేతుల్లో ఉన్న ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు ఎమర్జెన్సీ బ్రేకులను వేశాడు. జరగాల్సిన పెద్ద ప్రమాదాన్ని తప్పించి.. చిన్న ప్రమాదానికి పరిమితం చేశాడు. అందరి ప్రాణాలను కాపాడాడు. బ్రేకులేసిన క్రమంలో రైలు పట్టాలు తప్పి స్టేషన్ లోని ప్లాట్ ఫాంను ఢీకొట్టడంతో ఆ డ్రైవర్ చనిపోయాడు.

ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడు ఆ డ్రైవర్ యాంగ్ యోంగ్ ను దేశమంతా స్మరించుకుంటోంది. హీరో అని నినదిస్తోంది. గ్వాఝూలోని రోంగ్జియాంగ్ రైల్వేస్టేషన్ కు సమీపంలోని సొరంగంలోకి ప్రవేశించగానే యాంగ్ యోంగ్.. పట్టాలమీద రాళ్లు, బురద, మట్టిపెళ్లలున్నట్టు గుర్తించాడని అధికారులు చెప్పారు. వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేయగా.. ఆ రైలు వాటిని ఢీకొట్టి 900 మీటర్ల పాటు జారుకుంటూ వెళ్లిందని, ఆ తర్వాత పట్టాలు తప్పిందని తెలిపారు. ప్రమాదంలో యాంగ్ చనిపోగా 8 మంది గాయపడ్డారు. మిగతా వాళ్లంతా సురక్షితంగా ఉన్నారు. కాగా, యాంగ్ స్వస్థలమైన జూన్యీకి అతడి మృతదేహాన్ని తరలిస్తుండగా.. స్థానికులు వీధుల్లో నిలబడి సెల్యూట్ తో వీడ్కోలు పలికారు. రైలు డ్రైవర్ కాకముందు అతడు పీపుల్స్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (పీఏపీ)లో 1993 నుంచి 1996 వ‌ర‌కు పనిచేశాడు. తర్వాత రిటైర్ అయ్యి కో డ్రైవర్, అసిస్టెంట్ డ్రైవర్, ఫోర్ మ్యాన్, డ్రైవర్, ఇన్ స్ట్రక్టర్, గ్రౌండ్ డ్రైవర్, ట్రైన్ డ్రైవర్ వంటి ఉద్యోగాలు చేశాడు.

https://twitter.com/Michael04222710/status/1533649242807537666
Advertisement

తాజా వార్తలు

Advertisement