Friday, November 22, 2024

విజ‌య్ సేతుప‌తి బ‌ర్త్ డే – ఆయ‌న గురించి ప‌లు విష‌యాలు

పాత్ర ఏదైనా ప‌ర‌కాయ‌ప్ర‌వేశం చేయ‌డంలో అత‌నికి అత‌నే సాటి. హీరోగానే కాదు విల‌న్ గా కూడా త‌న స‌త్తా చాటారు. హీరోగా ఒక‌వైపు న‌టిస్తూనే మ‌రోవైపు తండ్రి పాత్ర‌లో మెర‌వ‌డం ఆయ‌న‌కే చెల్లిందేమో. పాత్ర చిన్న‌దా, పెద్ద‌దా అనే సంబంధం లేకుండా త‌న‌కి వ‌చ్చిన అవ‌కాశాల‌న్నింటిని పుణికి పుచ్చుకుని ఇప్పుడు త‌మిళంలో స్టార్ హీరోగా ఎదిగారు. ఆయ‌నే విజ‌య్ సేతుప‌తి. ఇప్ప‌టి వ‌ర‌కు 30కి పైగా చిత్రాల్లో న‌టించారు. విజయ్ సేతుపతి 1978 జనవరి 16న తమిళనాడులోని రాజపాళయంలో జన్మించారు. చెన్నైలోని కోడంబాక్కమ్‌లోని MGR హయ్యర్ సెకండరీ స్కూల్‌లో విజయ్ సేతుపతి తన విద్య అభ్యసించాడు, అనంతరం చెన్నైలోని ధనరాజ్ బాద్ జైన్ కాలేజీలోబికాం డిగ్రీ పట్టాను అందుకున్నారు. విజయ్ సేతుపతి కి 2003లో వివాహమైంది. భార్య పేరు జెస్సీ సేతుపతి. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూతురు శ్రీజ, కొడుకు సూర్య. విజయ్ 2010లో చాలా షార్ట్ ఫిల్మ్‌లలో పనిచేశారు. ఉత్తమ నటుడిగా ఎన్నో అవార్డులు అందుకున్నారు. విజయ్ 2015లో వచ్చిన ‘ఆరెంజ్ మిఠాయి’ చిత్రానికి రచయిత , నిర్మాత. చాలా పాటలు కూడా స్వయంగా రాశారు. విజయ్ ‘విజయ్ సేతుపతి ప్రొడక్షన్’ పేరుతో తన సొంత ప్రొడక్షన్ హౌస్‌ను కూడా ప్రారంభించారు.

విజయ్ తన పాకెట్ మనీ సంపాదించడానికి సేల్స్‌మెన్, హోటల్ క్యాషియర్, ఫోన్ బూత్ ఆపరేటర్‌గా కూడా పనిచేశాడు. కాలేజీ చివర్లో అకౌంటెంట్ ఉద్యోగంలో చేరాడు. విజయ్‌కి ముగ్గురు తోబుట్టువులు ఉన్నారు. కుటుంబ బాధ్యతలను నెరవేర్చడానికి డబ్బు సంపాదన కోసం దుబాయ్ కూడా వెళ్ళాడు. విజయ్ సేతుపతి కోలీవుడ్ లో స్టార్ హీరో.. డబ్బింగ్ సినిమాతోనే కాదు.. మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహా రెడ్డి, ఉప్పెన వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు విజయ్ సేతు పతి. నేడు విజయ్ పుట్టిన రోజు. అతని పూర్తి పేరు విజయ్ గురునాథ్ సేతుపతి కాళీమాతు. విజయ్ నటుడు మాత్రమే కాదు.. నిర్మాత, మాటల రచయిత, సంభాషణల రచయిత. అనేక తమిళ చిత్రాలకు వివిధ విభాగాల్లో పనిచేశారు. నటుడుగా వెండి తెరపై విజయ్ సేతుపతి అడుగు పెట్టడానికి ముందు అకౌంటెంట్ గా ఉద్యోగం చేసేవారు. నటనమీద ఉన్న ఇష్టంతో సినిమాల్లోకి అడుగు పెట్టారు. సినీ కెరీర్ ను సహాయ నటుడిగా ప్రారంభించారు. అయితే మంచి ఫేం ని తెచ్చింది సినిమా మాత్రం 2010లో రిలీజైన ‘తెన్మార్కు పరువుకటారు’ చిత్రం. ఈ చిత్రంలో విజయ్ ప్రధాన పాత్ర పోషించారు. 2012లో విడుదలైన ‘సుందరపాండియన్‌’ చిత్రంలో కూడా విజయ్‌ విలన్‌గా నటించారు. విజ‌య్ సేతుప‌తి సినీ ప్ర‌స్థానంలో ఎన్నో ఆటుపోట్ల‌ని త‌ట్టుకొని నేడు స్టార్ హీరోగా మారారు. ఆయ‌న మ‌రిన్ని చిత్రాల‌తో విజ‌యాలు సాధించాల‌ని కోరుకుందాం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement