నారప్పగా అలరించిన విక్టరీ వెంకటేష్..ఇప్పుడు రాంబాబుగా దృశ్యం2లో ఆకట్టుకున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం విడుదలయింది. మరి ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకులని అలరించిందో చూద్దాం..ఈ మధ్యకాలంలో వెంకటేష్ విభిన్న కథలను ఎంచుకుంటూ తనదైనశైలిలో దూసుకుపోతున్నారు. కావడానికి రీమేక్ కథలే అయినా కూడా వాటిని తెలుగు ప్రేక్షకులకు అందించడంలో సక్సెస్ అవుతున్నాడు. పోలీస్ ఆఫీసర్ గీత కొడుకు(విక్రమ్) కేసు నుంచి బయటపడ్డ రాంబాబు (వెంకటేష్) ఫ్యామిలీకి మళ్లీ ఆరేళ్ల తరువాత కష్టాలు మొదలవుతాయి. ఈ ఆరేళ్లలో ఊర్లో రాంబాబు చాలా ఎదుగుతాడు. కేబుల్ ఆపరేటర్ స్థాయి నుంచి థియేటర్ ఓనర్ వరకు ఎదుగుతాడు. ఎలాగైనా సరే తన వద్ద ఉన్న పాయింట్స్‌తో సినిమా తీయాలని అనుకుంటాడు. ఈ మేరకు రైటర్ వినయ్ చంద్ర (తణికెళ్ల భరణి)సాయం అడుగుతాడు.
రాంబాబు ఇలా తన సినిమా పనుల్లో బిజీగా ఉంటాడగా..మరో వైపు పాత కేసును తవ్వుతుంటారు పోలీసులు. ఇందుకోసం అండర్ కవర్ ఆపరేషన్ కూడా చేస్తారు. రాం బాబు ఇంట్లో జరిగే విషయాలు, మాట్లాడుకునే సంగతులు కూడా పోలీసులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. కానీ శవాన్ని ఎక్కడ పెట్టారో ఇటు కుటుంబ సభ్యులకు కూడా రాంబాబు చెప్పడు. అది తెలియక పోతే పోలీసులు అడుగు ముందుకు వేయలేరు.అయితే పోలీసులు వేసిన ఎత్తులు ఏంటి .. రాం బాబు వేసిన పై ఎత్తులు ఏంటి..అసలు శవం పోలీసులకు దొరికిందా? చివరకు రాం బాబు ఏం చేశాడు.. సినిమా తీయాలని అంత పట్టు ఎందుకు పట్టాడు..దానికి ఈ కేసుకు ఏమైనా సంబంధం ఉందా? చివరకు ఇచ్చిన ట్విస్ట్ ఏంటన్నదే దృశ్యం 2 సినిమా కథ. దృశ్యం మొదటి పార్ట్, రెండో పార్ట్‌కు కొన్ని పాత్రలు యాడ్ అయ్యాయి. వాటితోనే కథ మలుపులు తిరుగుతుంది. జనార్థన్ (షఫీ), సరిత (సుజ), సంజయ్ (సత్యం రాజేష్), ఐసీ గౌతమ్ సాహూ (సంపత్) పాత్రలతో ఈ పార్ట్ ఇంకాస్త ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. తన ఫ్యామిలీ కోసం ప్రతీ క్షణం ఆలోచించే రాంబాబు, నిజాన్ని తనలోనే మోస్తూ బాధపడే తీరు, పోలీసుల అంచనాలకు మించి వేసే ఎత్తులతో రాంబాబు అందరినీ ఆకట్టుకుంటాడు. నిజం ఎప్పుడెప్పుడు బయటపడుతుందా? అని జ్యోతి పాత్రలో మీనా అద్భుతంగా నటించింది. నదియా, నరేష్, సంపత్ రాజ్ తమ పాత్రల్లో చక్కగా నటించారు. అప్పుడప్పుడు కనిపించినా షఫీ, చమ్మక్ చంద్రల పాత్రలకు కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. రైటర్ పాత్రలో నటించిన తణికెళ్ల భరణితో అసలు కథ చెప్పించారు. అలా నటీనటులందరికీ సముచితమైన ప్రాముఖ్యత ఉంది.మొత్తానికి మరో సస్పెన్స్ , థ్రిల్లర్ చిత్రంగా ప్రేక్షకులని అలరిస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..