తమిళస్టార్ హీరో శివకార్తికేయన్ కోర్టు మెట్లెక్కాడు. ప్రముఖ నిర్మాత కె. ఇ. జ్ఞానవేల్ రాజా తనకు రెమ్మ‍్యునరేషన్ ఇవ్వలేదని మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. 2019లో శివకార్తికేయన్ హీరోగా నటించిన “మిస్టర్ లోకల్” అనే సినిమా రిలీజై భారీ డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమాలో నటించడానికి హీరోకు రూ.15 కోట్లు ఆఫర్ చేశారు నిర్మాతలు. కానీ ఇప్పటి వరకూ పూర్తి రెమ్యూనరేషన్ ను చెల్లిందలేదని అభియోగం. అందుకే ఇప్పుడు “మిస్టర్ లోకల్” సినిమాను నిర్మించిన నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజాపై శివకార్తికేయన్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాదు రెబల్, చియాన్ 61, పాతు తాలా పేరుతో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్‌లలో నిర్మాత జ్ఞానవేల్ రాజా పెట్టుబడులు పెట్టకుండా నిరోధించాలని, ఈ మూడు సినిమాలకు సంబంధించి థియేట్రికల్ రిలీజ్ లేదా ఆయా సినిమాలకు సంబంధించి ఎలాంటి హక్కులను అమ్మకుండా నిషేధించాలని శివకార్తికేయన్ కోర్టును కోరారు. ఇక శివకార్తికేయన్.. రెమో, హీరో, వరుణ్ డాక్టర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఇటీవల ‘బీస్ట్’ మూవీ నుంచి అదరగొట్టిన సూపర్ హిట్ సాంగ్ ‘అరబిక్ కుతు’కు లిరిక్స్ అందించాడు. ప్రస్తుతం శివ కార్తికేయన్ నటించిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లల్ ‘అయాలాన్’ విడుదలకు సిద్దంగా ఉంది. ఈ చిత్రానికి రవి కుమార్ దర్శకత్వం వహించారు. మరో ప్రక్క తమిళ, తెలుగు భాషల్లో జాతిరత్నాలు దర్శకుడుతో ఓ చిత్రంలో నటిస్తున్నాడు.
కోర్టు మెట్లెక్కిన హీరో శివకార్తికేయన్ – నిర్మాతపై హైకోర్టులో పిటిషన్
Advertisement
తాజా వార్తలు
Advertisement