బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ పై హీరో సిద్ధార్థ్ చేసిన ట్వీట్ పెద్ద దుమారాన్నే రేపింది. దాంతో సోషల్ మీడియా వేదికగా సిద్ధార్థ్ ని ఏకిపారేస్తున్నారు నెటిజన్లు. అంతేకాదు సిద్ధార్ధ్ చేసిన వ్యాఖ్యలపై సైనా తండ్రి కూడా విరుచుకుపడ్డారు. సైనా నెహ్వాల్ భర్త, బ్యాడ్మింటన్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ సహా పలురువు సోషల్ మీడియా వేదికగా సిద్ధార్ద్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటన సమయంలో ఆయనపై దాడి చేయడంతో దేశ ప్రధానికి రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి అన్న విధంగా ఆ ఘటన పై స్పందిస్తూ సైనా నెహ్వాల్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.అయితే తను చేసిన ట్వీట్ ద్వారా ఎవరిని అగౌరవపరిచ లేదు అంటూ సిద్ధార్థ్ వివరించే ప్రయత్నం చేశారు.
తాజాగా నటుడు సిద్ధార్ద్ ట్విట్టర్ వేదికగా తను పెట్టిన కామెంట్స్ పై మళ్ళీ స్పందించారు. బాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ కి క్షమాపణలు చెబుతూ సిద్ధార్ధ్ బహిరంగ లేఖ విడుదల చేశారు. సైనా పెట్టిన ట్వీట్ మీద, తాను పెట్టిన పోస్ట్ ఒక జోక్ మాత్రమే నని వివరణ ఇచ్చారు. అయితే తాను పెట్టిన కామెంట్ చాలా మందిని బాధించిందని అన్నారు. తనకు మహిళలను కించపరుస్తూ కామెంట్స్ చేయాలనే ఉద్దేశ్యం తనది కాదంటూ వివరణ ఇచ్చారు. సైనా నెహ్వాల్ గొప్ప క్రీడాకారిణి అని.. తాను ఆమెను గౌరవిస్తానని అన్నారు. అంతేకాదు తాను పెట్టిన పోస్టు చాలా మందిని బాధపెట్టిందని.. కనుక అలాంటి తాను పోస్ట్ చేసిన కామెంట్స్ పై క్షమాపణ కోరుతున్నానని తెలిపాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..