ఏపీలో సినిమా రేట్ల పై ట్వీట్ చేశాడు హీరో సిద్ధార్థ్.. మూవీ టికెట్స్ , పార్కింగ్ ఫీజ్ ని నిర్ణయించే నైతిక హక్కు ప్రభుత్వాలు, రాజకీయా నాయకులకు లేదన్నారు. ప్రభుత్వాలు సినిమా కన్నా మద్యం, పొగాకు ఉత్పత్తులకు మంచి గౌరవం ఇస్తున్నాయని విమర్శించారు. తమ వ్యాపారం ద్వారానే లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారన్నారు. తాము వ్యాపారం ఎలా చేసుకోవాలో ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. పన్నులు వేయండి.. సినిమాలను లాజిక్ లేకుండా సెన్సార్ చేయండి.. ఏదైనా చేయండి.. కానీ, టికెట్ రేట్లను తగ్గించి నిర్మాతలు, ఉపాధి పొందుతున్న వారి పొట్ట మీద కొట్టరాదని డిమాండ్ చేశారు. సినిమాలు చూడండంటూ ఎవరూ ఎవరినీ అడగడం లేదని, చాలా మంది పైరసీ చూస్తూ తమకు ఉచితంగా సినిమాలు కావాలని అడుగుతున్నారని మండిపడ్డారు. అలాంటి వారికి సినీ పరిశ్రమ నుంచి ఎలాంటి సబ్సిడీలు అందబోవని స్పష్టం చేశారు. కోట్లు సంపాదించే ప్రతి సినీ నిర్మాతకు.. జీతాలు చెల్లించాల్సిన ఎంతో మంది ఉద్యోగులు, ఇన్వెస్టర్లుంటారని చెప్పారు. డబ్బున్నోళ్ల గురించే మాట్లాడాల్సి వస్తే.. ప్రతి రంగంలోనూ ఉన్నారని అన్నారు. కేవలం సినీ పరిశ్రమ మీద పడి ఏడ్వడం దేనికని ప్రశ్నించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement