మాస్ మహారాజ్ రవితేజ నటిస్తోన్న ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వరరావు. ఈ చిత్రాన్ని దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్నాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా, తేజ్ నారాయణ్ అగర్వాల్ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. రవితేజ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 1970వ దశకంలో దక్షిణ భారతదేశంలోనే పేరుమోసిన, సాహసోపేతమైన స్టువర్టుపురం నాగేశ్వరరావు కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కాగా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్లో చిత్ర ప్రధాన బృందం సమక్షంలో గ్రాండ్‌గా సినిమాను లాంఛ్ చేశారు. ఈ సినిమాలో కృతి సనన్ సోదరి నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ తన సంగీతంతో అలరించనున్నారు.పవర్ ఫుల్ పాత్రలో నటించేందుకు రవితేజ పూర్తిగా తనను తాను మలుచుకోనున్నాడు. అందుకు తగిన బాడీ లాంగ్వేజ్, డిక్షన్, గెటప్ పూర్తి భిన్నంగా ఉండబోతున్నాయి.. ఇంతకు ముందు ఎప్పుడూ చేయని పాత్రలో రవితేజ కనబడనున్నాడు.ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో రిలీజ్ కానుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement