వెడ్డింగ్ యానివర్సరీల సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఫ్యామిలీ ఒకే చోట కలిసి సెలబ్రేట్ చేసుకున్నాయి. ఎన్టీఆర్, ఆయన భార్య లక్ష్మీ ప్రణతి, ప్రశాత్ నీల్, ఆయన భార్య లిఖితలు వేడుక జరుపుకున్నారు. ఇన్స్టాగ్రామ్ లో వీటికి సంబంధించిన ఫొటోలను జూనియర్ ఎన్టీఆర్ షేర్ చేశారు. ‘సరికొత్త ప్రారంభం’ అంటూ ఎన్టీఆర్ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. మరోవైపు తారక్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో సినిమా తెరకెక్కబోతోంది. ఇది తారక్ కు 31వ సినిమా కావడం గమనార్హం. వీరిద్దరి కాంబినేషన్ లో రాబోయే చిత్రం ఒక రేంజ్ లో ఉంటుందని, బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కావడం ఖాయమని అభిమానులు అప్పుడే ఓ అంచనాకు వచ్చేస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement