గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు యంగ్ హీరో నిఖిల్ తండ్రి..శ్యామ్ సిద్ధార్థ. ఈయన నేడు కన్నుమూశారు. హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. నిఖిల్ హీరోగా ఎదిగేందుకు ఆయన తండ్రి ఎంతో కృషి చేశారు. కొడుకుని ఎంతో ప్రోత్సహించారు. ఒక సందర్భంలో తన తండ్రిని సోషల్ మీడియా వేదికగా అభిమానులకు నిఖిల్ పరిచయం చేశాడు. మరోవైపు నిఖిల్ తండ్రి చనిపోవడంపై పలువురు సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. నిఖిల్ కుటుంబానికి సంతాపాన్ని తెలియజేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement