నటుడు మాధవన్ తనయుడు వేదాంత్ నేషనల్ లెవల్ స్విమ్మింగ్ ఛాంపియన్. కాగా మహారాష్ట్రలో జరిగిన స్విమ్మింగ్ పోటీల్లో ఏడు మెడల్స్ ని గెలిచాడు కూడా. ఇక ఇండియా తరపున వేదాంత్ 2026ఒలంపిక్స్ లో ప్రాతినిధ్యం వహించబోతున్నాడు. దాంతో కొడుకు కెరీర్ కోసం కష్టపడుతున్నాడు మాధవన్. కోవిడ్ ఆంక్షల కారణంగా ఇండియాలో ఒలింపిక్స్ స్థాయి స్విమ్మింగ్ ఫూల్స్ అందుబాటులో లేవు.
దీంతో కొడుకును శిక్షణ నిమిత్తం మాధవన్, భార్య సరితలతో కలిసి దుబాయ్ తీసుకెళ్లాడు. కోవిడ్ ఆంక్షల వల్ల ముంబైలో పెద్ద స్విమ్మింగ్ ఫూల్స్ అందుబాటులో లేవు. దుబాయ్ లో ఒలింపిక్స్ స్థాయిలో స్విమ్మింగ్ ఫూల్స్ అందుబాటులో ఉండటంతో ఇక్కడికి వచ్చామని మాధవన్ తెలిపాడు. తన కొడుకుకి సినిమారంగంపై ఆసక్తి లేదు. అందుకే తను ఇష్టపడిన రంగంలో ప్రోత్సహిస్తున్నాం అని వెల్లడించాడు. తన కొడుకు స్మిమ్మింగ్ లో ప్రపంచ ఛాంపియన్ షిప్ పతకాలు గెలుస్తున్నాడని.. మేము గర్వపడేలా చేస్తున్నాడని అన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..