సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ ని పెట్టాడు మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు, నటుడు కళ్యాణ్ దేవ్. తన మేకోవర్ లుక్ ని షేర్ చేసిన కళ్యాణ్ దేవ్ ఇంట్రెస్టింగ్ ట్యాగ్ ని జోడించాడు. నీకు ఎవరైనా ఏదైనా చెబితే నువ్వు పెద్దగా పట్టించుకోకు. ఒక నవ్వు నవ్వి వదిలెయ్. నీకు నచ్చింది నువ్వు చెయ్ అంటూ కొటేషన్‌ను యాడ్ చేశాడు. కాగా రీసెంట్ గా ఆయన పెట్టిన మరో పోస్ట్ వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో మరో ఫొటోని పంచుకున్న కళ్యాణ్ దానికి ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చాడు. సముద్రపు అలల మధ్య ఉదయించిన సూర్యుడి ఫోటోను షేర్‌చేస్తూ.. ఎన్నో ఆశలతో ప్రేమగా, సంతోషంగా ఉన్నట్లు తెలిపాడు.
ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. కళ్యాణ్ దేవ్ కు మెగా ఫ్యామిలీకి పడటం లేదు అని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ మధ్య మెగా ఫ్యామిలీల ఫంక్షన్స్ లో కూడా యంగ్ హీరో కనిపించకపోవడంతో అనుమానాలు బలపడుతున్నాయి. అటు శ్రీజా కూడా ఎప్పుడు సింగింల్ గానే కనిపిస్తుంది. వీరిద్దరు కలిసి ఈ మధ్య సందడి చేసిన సందర్భాలు లేవు. దాంతో వీరి మధ్య ఏం జరుగుతుందా అని సోషల్ మీడియా జనాలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..