Tuesday, November 19, 2024

యాక్ష‌న్ కింగ్ ‘అర్జున్’ కి క‌రోనా

ఇప్పుడు స‌మ‌స్య క‌రోనాతో పాటు ఒమిక్రాన్ కూడా. దాంతో జ‌నం బెంబేలు ఎత్తుతున్నారు. సెల‌బ్రిటీలు సైతం ఈ మ‌హ‌మ్మారీ బారిన ప‌డుతున్నారు. కాగా యాక్ష‌న్ కింగ్ అర్జున్ క‌రోనాబారిన ప‌డ్డాడు. ఈ విష‌యాన్ని ఆయ‌న సోష‌ల్ మీడియాలో తెలిపారు. తనకు తాను ఐసోలేట్‌ అయినట్టు, అలాగే కోవిడ్‌కి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఇటీవల కాలంలో తనని కలిసిన వారంతా టెస్టులు చేయించుకోవాలన్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని, మాస్క్ కచ్చితంగా ధరించాలని తెలిపారు. అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అయితే ఎలా సోకిందనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement