Friday, November 22, 2024

పెళ్ళి పీట‌లు ఎక్క‌నున్న అఖిల్ !

హీరో అఖిల్ కి నిశ్చితార్థం జ‌రిగి పెళ్లి క్యాన్సిల్ అయిన విష‌యం తెలిసిందే. అఖిల్ , శ్రీయా భూపాల్ ల నిశ్చితార్థం గ్రాండ్ గా జ‌రిగింది. కాగా ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త జివికే కంపెనీల అధినేత మ‌న‌వ‌రాలు శ్రీయ‌.ఇక అఖిల్- శ్రీయా భూపాల్ ల వివాహం ఇటలీలో జరిపించాలని ఇరు కుటుంబాలు డిసైడ్ అయ్యాయి. కానీ అంతలోనే అఖిల్, శ్రీయల మధ్య మనస్పర్థలు వచ్చాయని టాక్ వినిపించింది. దీంతో వారిద్దరు వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టకుండానే వారి పెళ్లి కి శుభం కార్డు పడింది. కాగా అక్కినేని ఇంటికి త్వరలోనే కొత్త కోడలు రాబోతోందట. ఇంటికి పెద్ద కోడలిగా వచ్చిన సమంత విడాకులు తీసుకొని మధ్యలోనే వెళ్ళిపోయింది.

దీంతో నాగార్జున చిన్న కోడలిని తీసుకురావాలని భావిస్తున్నారట. అంటే అఖిల్ పెళ్లి త్వరలో చేయాలని అక్కినేని ఫ్యామిలీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.ఇప్పటికే అఖిల్ పెళ్లి కోసం నాగార్జున మంచి సాంప్రదాయ పద్ధతిలో కలిగిన కుటుంబం నుంచి ఓ అమ్మాయిని చూశారట. ఈ సంబంధం దాదాపు ఫిక్స్ అయినట్టే అని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీ కి సంబంధం లేని అమ్మాయిని అఖిల్ కోసం ఏరికోరి సెలెక్ట్ చేసారట నాగార్జున. ప్రస్తుతం ఇదే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. మరి ఇది ఎంత వరకు నిజం అనేది తెలియాలంటే దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేంతవరకు ఆగాల్సిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement