ఓ నిండు చూలాలు బేబీ షవర్ వేడుకలో ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేసింది.సీమంతం వేడుకలో తన భర్తతో కలిసి కాలుకదిపింది.కింగ్ సినిమాలోని ‘మాన్ మేరీ జాన్’ పాటకు స్టెప్పులేస్తూ సందడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు గర్భిణి డ్యాన్స్‌కు ఫిదా అవుతూ.. కామెంట్లు పెడుతున్నారు.
తల్లిదండ్రులుగా ప్రొమోషన్ పొందే క్షణాలు ఎంతో అపురూపం. ఏ జంటైనా ఆ మధుర క్షణం కోసం వేయి కళ్లతో వేచి చూస్తుంటారు. భార్య గర్భవతి అని తెలిసిన క్షణం భర్త సహా ఇంటిల్లిపాదీ ఆనందంతో పండగ చేసుకుంటారు. గర్భం దాల్చినప్పటి నుంచి చిన్నారికి జన్మనిచ్చే వరకూ ఆ ఇల్లాలిని ఎంతో అపురూపంగా చూసుకుంటారు. ఆ సమయంలో గర్భిణి కోరికలను తీరుస్తుంటారు. ముఖ్యంగా ఇరు కుటుంబ సభ్యులు కలిసి సీమంతం వేడుకను ఘనంగా జరిపిస్తుండటం మన సంప్రదాయమన్న సంగతి తెలిసిందే.
బేబీ షవర్ వేడుకలో డ్యాన్స్ చేసిన నిండు గర్భిణీ.. వైరల్ గా వీడియో
Advertisement
తాజా వార్తలు
Advertisement