కొవిడ్‌కు వ్యతిరే పోరాటంలో సహజ ఇన్‌ఫెక్షన్ ద్వారా వ్యాధి నిరోధక శక్తిని పొందాలనే ఆలోచన అవివేకం అని, దీనికి భారీ మూల్య చెల్లించవలసి ఉంటుందన్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్. కొత్త Omicron సబ్-వేరియంట్ లోని BA.1 కంటే BA.2 మరింత శక్తివంతమైందన్నారు. దాని వ్యాప్తి ఇతర ఉప-వేరియంట్‌ల కంటే ఎక్కువగా ఉందన్నారు. ఇది కొన్ని దేశాల్లో ముఖ్యంగా భారతదేశం, డెన్మార్క్ లలో చలా వేగంగా వ్యాపిస్తోందని ఆమె తెలిపారు.
Omicron కొత్త వైవిధ్యమైనందున దాని ప్రభావంపై ఇప్పుడే ఏం చెప్పలేమని.. ఇది తిరిగి ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుందా, దీర్ఘకాలిక రోగనిరోధక శక్తిని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి అధ్యయనాలు కొనసాగుతున్నాయన్నారు. ప్రస్తుత వ్యాక్సిన్‌లు ఓమైక్రాన్‌కు ఎలా స్పందిస్తున్నాయో తెలియాల్సి ఉందన్నారు. కొత్త వేరియంట్‌ను న్యూట్రలైజ్ చేసే అవకాశం తక్కువగా ఉందని ల్యాబ్ స్థాయి అధ్యయనాలు చెబుతున్నాయన్నారు. అయితే, గుడ్ న్యూస్ ఏమిటంటే.. టీకాలు వేసుకున్న వారు కరోనా బారిన పడిన తర్వాత తక్కువ మరణాలు సంభవించాయన్నారు. కానీ, ఇది తీవ్రమైన వ్యాధులకు కారణమవుతున్నట్టు క్లినికల్ డేటా చూపిస్తుందని చెప్పారు. ప్రస్తుత వ్యాక్సిన్‌లు ఓమిక్రాన్ జాతిపై పనిచేస్తాయా లేదా అనే దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు సౌమ్య స్వామినాథన్.
మరిన్ని ఉత్పరివర్తనాలపై మాట్లాడుతూ.. ఇది ఆర్‌ఎన్‌ఏ వైరస్ అని.. అనేక మ్యుటేషన్‌లో ఉండటం సహజమని ఆమె అన్నారు. వైరస్ యొక్క అన్ని రకాలకు వ్యతిరేకంగా పనిచేసే యూనివర్సల్ వ్యాక్సిన్ గురించి WHO చర్చిస్తోందని డాక్టర్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు. “పాన్-కరోనావైరస్ వ్యాక్సిన్ లేదా పాన్-SARS వ్యాక్సిన్ హోలీ గ్రెయిల్, ఆదర్శంగా ఉంటుంది. శాస్త్రీయంగా ఇది ఆమోదయోగ్యమైనది. సాధ్యమే, కానీ ఇవన్నీ పని చేస్తున్నాయి. మనం వేచి చూడాలి ” అని చెప్పారు. యూనివర్సల్ ఇన్‌ఫ్లుఎంజా వ్యాక్సిన్‌ని రూపొందించే ప్రయత్నాలతో ప్రస్తుతం కొత్త జాతుల కారణంగా ఇన్ఫ్లుఎంజా షాట్ ప్రతి సంవత్సరం సవరించబడాలన్నారు.
హెటెరోలాగస్ బూస్టర్ షాట్‌లు (బూస్టర్ షాట్ కోసం ఇంతకు ముందు తీసుకున్న దానికంటే వేరే వ్యాక్సిన్‌ను ఉపయోగించినప్పుడు) మరియు స్థానిక శ్లేష్మ నిరోధక శక్తిని అందించడానికి ఇంట్రానాసల్ వ్యాక్సిన్‌ను కూడా అన్వేషిస్తున్నట్లు ఆమె చెప్పారు. బూస్టర్ షాట్‌లపై నిర్ణయాలు తీసుకోవడానికి స్థానిక డేటాను అధ్యయనం చేయాలని డాక్టర్ స్వామినాథన్ నొక్కి చెప్పారు.