Friday, November 22, 2024

Breaking: అమర్​నాథ్​ యాత్రికుల సహాయార్థం హెల్ప్​లైన్​ నెంబర్లు.. రంగంలోకి దిగిన ఆర్మీ

అమర్‌నాథ్ పవిత్ర గుహ ప్రదేశంలో క్లౌడ్‌బర్స్ట్ తో ఎఫెక్ట్​ అయిన ప్రాంతంలో యాత్రికుల సహాయం కోసం ఆర్మీ హెలికాప్టర్‌లతో సహా ఆరు రెస్క్యూ బృందాలను భారత సైన్యం శుక్రవారం ప్రారంభించింది. ఈ మేరకు నార్తర్న్ కమాండ్, ఇండియన్ ఆర్మీ ఈ వివరాలు వెల్లడించింది. దక్షిణ కాశ్మీర్ హిమాలయాల్లోని అమర్‌నాథ్ పవిత్ర గుహ సమీపంలో శుక్రవారం సాయంత్రం ఆకస్మిక వరదలు సంభవించి 25 గుడారాలు, మూడు కమ్యూనిటీ కిచెన్‌లు దెబ్బతిన్నాయి. దీంతో దాదాపు 13 మంది చనిపోయినట్టు పోలీసు అధికారులు అంచనా వేస్తున్నారు.  వరదల్లో గల్లంతైన వారిలో ముగ్గురిని రక్షించినట్లు వారు తెలిపారు. భారీ వర్షాల మధ్య సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో మేఘాల విస్ఫోటనం సంభవించిందని తెలిపారు.

ఇక.. పుణ్యక్షేత్రం వెలుపల ఉన్న బేస్ క్యాంప్‌లోకి ప్రవహించే నీరు 25 గుడారాలు, యాత్రికులకు ఆహారం అందించే మూడు కమ్యూనిటీ కిచెన్‌లను దెబ్బతీసిందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం క్షతగాత్రులను బేస్ క్యాంపు ఆసుపత్రులకు తరలించడంపై దృష్టి సారించామని అమర్‌నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు సీఈవో తెలిపారు. క్లౌడ్‌బర్స్ట్ వల్ల ప్రభావితమైన వారి కోసం హెల్ప్ లైన్, టోల్ ఫ్రీ నంబర్‌లను కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

హెల్ప్ లైన్ నంబర్‌లు

NDRF: 011-23438252, 011-23438253

Kashmir Divisional Helpline:
0194-2496240

- Advertisement -

Shrine Board Helpline:
0194-2313149

Toll free numbers:
Jammu: 18001807198, Srinagar: 18001807199

జమ్మూ కాశ్మీర్ పోలీసులు ప్రతికూల వాతావరణ పరిస్థితులు, క్లౌడ్ పేలుడు దృష్ట్యా, ఎలాంటి సహాయం కోసం ఈ క్రింది టెలిఫోన్ నంబర్‌లను సంప్రదించాలని సాధారణ ప్రజలకు సూచించారు.

Joint Police Control Room Pahalgam
9596779039, 9797796217, 01936243233, 01936243018

Police control room Anantnag
9596777669, 9419051940, 01932225870, 01932222870

Advertisement

తాజా వార్తలు

Advertisement