తమిళనాడు సర్కారు మరో వినూత్న పథకం అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు సీఎం ఎంకే స్టాలిన్ ఈ వివరాలను ట్విట్టర్ ద్వారా సోమవారం తెలియజేశారు. రోడ్డు ప్రమాద బాధితులకు వైద్య సదుపాయాలను అందించడంలో సహాయపడే వారికి నగదు పురస్కారం అందిస్తామన్నారు.
అంతేకాకుండా వారికి రివార్డులు, ధ్రువీకరణ పత్రాలు కూడా ఇస్తామని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్న వారికి సహాయం చేసి, గోల్డెన్ అవర్ వ్యవధిలో వారికి వైద్యం అందేలా కృషి చేసిన వారికి ప్రశంసా పత్రంతో పాటు రూ.5వేల నగదు బహుమతి కూడా ఇస్తామని సీఎం తెలిపారు. ఈ మేరకు ఈ వివరాలన్నీ ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు.