ఓ హెలికాప్టర్ ఎగురుతూ ఉండగానే ఉన్నట్టుండి సడెన్గా కూలిపోయింది. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడా దగ్గరున్న బీచ్‌లో జరిగింది. ఈ యాక్సిడెంట్లో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. మియామీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిన్న మధ్యాహ్నం తమకు హెలికాప్టర్ క్రాష్ గురించి ఫోన్ కాల్ వచ్చిందన్నారు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) కూడా ఈ ప్రమాదంపై స్పందించింది. హెలికాప్టర్లో ముగ్గురు ప్రయాణికులు ఉన్నారు. ఇద్దరిని ఆసుపత్రికి తరలించారని పోలీసులు తెలిపారు.
రద్దీగా ఉండే బీచ్‌లో చాలా మంది సరదాగా ఈత కొడుతున్నారు. కాగా వారికి సమీపంలోని హెలికాప్టర్ గుండ్రంగా తిరుగుతూ వచ్చి అట్లాంటిక్ మహాసముద్రంలో పడిపోయింది. హెలికాప్టర్ ఇంజిన్ పవర్ ప్రాబ్లం వల్ల ఇట్లా జరిగి ఉంటుందని తాము ప్రాథమిక అంచనాకు వచ్చామని US డిపార్ట్ మెంట్ ఆఫ్ ట్రాన్స్ పోర్టేషన్ మాజీ ఇన్‌స్పెక్టర్ జనరల్ మేరీ స్కియావో తెలిపారు. అయితే.. నేషనల్ ట్రాన్స్ పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ తో కలిసి ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తామని ఏవియేషన్ అథారిటీ తెలిపింది.