Wednesday, November 27, 2024

జమ్ముకశ్మీర్‌లో భారీ మంచు.. నాలుగు జిల్లాల్లో ప్ర‌మాద హెచ్చ‌రిక‌లు

గ‌త నాలుగురోజులుగా జమ్ముకశ్మీర్‌లో భారీగా మంచుకురుస్తోంది. దీంతో లోయలోని నాలుగు జిల్లాల్లో అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీచేశారు. రానున్న 24 గంటల్లో బారాముల్లా, గందర్‌బల్, కుప్వారా, బండిపొర మీదుగా 2,400 మీటర్ల ఎత్తులో ప్రమాద స్థాయితో హిమపాతం సంభవించే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. అందువల్ల ఈ నాలుగు జిల్లాల్లో భారీ హిమపాతం సంభవించే ప్రాంతాలకు ప్రజలు వెళ్లవద్దని సూచించింది. ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన గుల్‌మార్గ్‌లోని అఫర్వత్‌ పర్వతం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. భారీ కొండ‌చరియ విరగడంతో పోలండ్‌కు చెందిన ఇద్దరు పర్యాటకులు మృతిచెందారు. మరో 19 మంది పర్యాటకులు గాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement