Sunday, November 17, 2024

రైల్వేశాఖ‌కి.. భారీగా ఆదాయం

రైల్వే శాఖ కి భారీగా ఆదాయం వ‌చ్చిందట‌.2022-23 సంవత్సరంలో రైల్వే శాఖ ఆదాయం అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 25 శాతం పెరిగి రూ.2.4 లక్షల కోట్లకు చేరుకుంది. ఇందులో సరుకు రవాణా ద్వారా వచ్చిన ఆదాయం రూ.1.6 లక్షల కోట్లు. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 15 శాతం ఎక్కువగా వచ్చింది. ప్రయాణికుల రూపంలో ఆదాయం సైతం భారీగా పెరిగింది. రూ.63,300 కోట్లు ప్రయాణికుల ద్వారా వచ్చింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల ఆదాయంతో పోలిస్తే 61 శాతం పెరిగింది. రైల్వే శాఖ తీసుకున్న చర్యల వల్ల ఆపరేటింగ్ రేషియో 98.1 శాతానికి మెరుగుపడింది. రైల్వే శాఖ తన నెట్ వర్క్ విస్తరణపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.2.65 లక్షల కోట్ల భారీ నిధులను రైల్వే శాఖకు కేంద్ర బడ్జెట్ లో కేటాయించడం తెలిసే ఉంటుంది. రైల్వే శాఖ చర్యలు సత్ఫలితాలను కూడా ఇస్తున్నాయి. రైల్వేకు అంత భారీ నిధులు కేటాయించడం వెనుక కారణాన్ని పరిశీలిస్తే.. ఈ శాఖ భారీ ఆదాయాన్ని తెచ్చి పెడుతున్నట్టు అర్థమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement