Sunday, November 17, 2024

బి అలర్ట్: మరో రెండు రోజులు భారీ వర్షాలు

బంగాళాఖాతంలో 4.5 కిలోమీటర్ల ఎత్తున మరో ఉపరితల ఆవర్తనం ఉంది. ఈ నెల 6న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో తెలంగాణలో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు, రేపు పలుచోట్ల భారీ వర్షాలు పడతాయని తెలిపింది.

మరోవైపు గత రెండు రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలకు రాజధాని హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది. నిన్న రాత్రి కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీల్లో వరద నీరు ఇళ్లలోకి చేరింది. దీంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement