తెలంగాణలో మరో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి ఆవరించి ఉన్నది. దీని ప్రభావంతో గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతాయని తెలిపింది.
మరోవైపు హైదరాబాద్‌లో ఈ రోజు తెల్లవారుజామున ప్రారంభమైన వాన గంటపాటు దంచికొట్టింది. హైదరాబాద్‌తోపాటు నల్లగొండ, యాదాద్రి భువనగిరి, మెదక్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో ఈదురు గాలులతో కూడి వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి రోడ్లపై పడిపోయాయి. ముందుజాగ్రత్త చర్యగా అధికారులు విద్యుత్ నిలిపివేశారు.