Thursday, November 7, 2024

వెదర్ అలర్ట్: తెలంగాణలో రేపు భారీ వర్షాలు

తెలంగాణలో పలు జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఝార్ఖండ్ నుంచి ఒడిశా వరకు 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి వ్యాపించి ఉంది. దీంతో పశ్చిమ, వాయవ్య భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో శనివారం రాష్ట్రంల్లోని పలు జిల్లాల్లో ఓ మాదిరి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఆదివారం తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

నైరుతి రుతుపవనాలు ఈ నెల 4న తెలంగాణను తాకాయి. దీంతో తొలకరి వర్షాలు కురిశాయి. అయితే, ఆ తర్వాతి నుంచి వర్షాలు జాడే లేకుండాపోయంది. చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. రుతుపవనాల్లో కదలికలు లేక వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో 35 డిగ్రీల కంటే ఎక్కువే ఉష్ణోగ్రత నమోదైంది.

ఇది కూడా చదవండి: ఆనందయ్యకు సెల్యూట్: మద్రాస్ హైకోర్టు

Advertisement

తాజా వార్తలు

Advertisement