బంగాళాఖాతం వాయవ్య ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. దక్షిణ ఒడిశా- ఉత్తరాంధ్ర తీరాలను ఆనుకుని అల్పపీడనం కొనసాగుతోంది. తమిళనాడు వరకు 1500 మీటర్ల ఎత్తు వరకు గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడినట్టు వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో మంగళవారం ఉత్తరాంధ్రలో పలు చోట్ల వర్షాలు కురిశాయి. తీరప్రాంతంలో ఈదురుగాలులు వీచాయి. రానున్న రెండురోజుల్లో ఉత్తరకోస్తాలో కొన్నిచోట్ల భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, రాయలసీమలో ఒకటీ, రెండు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలోనూ అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
ఇది కూడా చదవండిః సీబీఐ విచారణలో వైసీపీ ఎంపీ అవినాష్ తండ్రి