తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాలో ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మెదక్, ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఆయా జిల్లాల్లో రికార్డు స్థాయిలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
మరోవైపు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. దీని ప్రభావం వల్ల వచ్చే 3 రోజుల్లో తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో కూడా నేడు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.