వాయుగుండం కారణంతో తెలగాణవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రాజధాని హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, యూసుఫ్ గూడ, మాదాపూర్, హైటెక్ సిటీ, అమీర్ పేట, ఖైరతాబాద్, పంజాగుట్ట, బండ్లగూడ జాగీర్, రాజేంద్రనగర్, అత్తాపూర్ తదితర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది.
మరోవైపు తెలంగాణలోని జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, రంగారెడ్డి తదితర జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మూడు రోజులపాటు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని ఒకటిరెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital