Saturday, November 23, 2024

ఢిల్లీలో భారీ వ‌ర్షాలు – రెండు విమానాలు ర‌ద్దు – ప‌లు విమానాలు దారి మ‌ళ్లింపు

ఢిల్లీని భారీ వర్షాలు అత‌లాకుత‌లం చేస్తున్నాయి. దాంతో ప‌లు విమానాల‌ను దారి మ‌ళ్లించారు. కాగా ప్ర‌యాణికులు తాజా
సమాచారం కోసం తాము ప్రయాణించే విమాన సేవల సంస్థలను సంప్రదించాలని ఢిల్లీ విమానాశ్రయం సూచించింది. మరిన్ని వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇప్ప‌టికే.. వాతావరణం కారణంగా 19 విమానాలు దారి మళ్లించారు..వందలాది మంది ప్రయాణికులు చిక్కుకున్నారు, ప్రతికూల వాతావరణం .. ఇతర సంబంధిత సమస్యల కారణంగా 40కి పైగా విమానాలు ఆలస్యం న‌డ‌వ‌నున్నాయి. ఢిల్లీ విమానాశ్రయానికి దాదాపు 18 అరైవల్ విమానాలు ఆలస్యం అయ్యాయి. రెండు విమానాలు రద్దు చేశారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో వాతావరణంలో మార్పు కారణంగా, చాలా విమానాలను జైపూర్, ఇతర విమానాశ్రయాల వైపు మళ్లించారు. కనీసం 19 విమానాలు జైపూర్, లక్నో, ఇండోర్, అమృత్‌సర్, ముంబైకి మళ్లించబడ్డాయి. వందలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారని సంబంధిత వర్గాలు తెలిపాయి. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఢిల్లీ నుంచి బయలుదేరే అన్ని విమానాల సమయాలను రీషెడ్యూల్ చేస్తున్నారు. ఢిల్లీ విమానాశ్రయం వెబ్‌సైట్ ప్రకారం, ప్రతికూల వాతావరణం మరియు ఇతర సంబంధిత సమస్యల కారణంగా బయలుదేరే 40కి పైగా విమానాలు ఆలస్యం అయ్యాయి. విమానాశ్రయానికి చేరుకునే ముందు, ప్రయాణికులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా సంబంధిత ఎయిర్‌లైన్ నుండి తమ విమాన సమాచారాన్ని పొందాలని ఎయిర్‌పోర్ట్ అథారిటీ తెలిపింది ఈదురు గాలుల కారణంగా ఢిల్లీలో పలు చోట్ల చెట్లు, ఇళ్లు కూలిపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement