Wednesday, November 20, 2024

Breaking: ఏపీలో భారీ వ‌ర్షాలు.. క‌ర్నూలు కొల్లువంక వాగులో కొట్టుకుపోయిన కారు..

రుతుప‌వ‌నాలు వ‌చ్చేశాయి.. నైరుతి తుపాను ఎఫెక్ట్‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌లు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఒంగోలు, నెల్లూరు, క‌డ‌ప‌, చిత్తూరు జిల్లాల్లో ఈదురుగాలుల‌తో కూడిన వ‌ర్షాలు కురుస్తున్నాయి. క‌ర్నూలు జిల్లా ఆలూరులో కురిసిన భారీ వ‌ర్షానికి క‌ల్లివంక వాగు ఉధృతంగా ప్ర‌వ‌హిస్తోంది. ఈ వాగు దాటుతుండ‌గా ఓ కారు నీటి ప్ర‌వాహంలో కొట్టుకుపోయింది. అయితే కారులో ఐదుగురు ఉండొచ్చ‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కారు గుంత‌క‌ల్లు నుంచి ఆలూరు వ‌స్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. గ‌ల్లంత‌యిన వారిని ర‌క్షించేందుకు పోలీసులు ట్రై చేస్తున్నారు. గ‌జ ఈత‌గాళ్ల‌ను రప్పిస్తున్నారు. వాగు పొంగిపొర్ల‌డంతో గుంత‌క‌ల్లు, ఆలూరుమ‌ధ్య రాక‌పోక‌లు నిలిచిపోయాయి.

అదేవిధంగా విశాఖ ఏరియాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కకురుస్తున్నాయి. హైదరాబాద్​ లోని పలు ప్రాంతాల్లో సోమవారం ఉదయం నుంచి వర్షం పడుతోంది. సూర్యాపేటలోనూ భారీ వర్షం కురుస్తోంది. ఈదురుగాలులకు విద్యుత్​ స్తంభాలు పడిపోయాయి. పలు ఇండ్లమీద నుంచి రేకులు కొట్టుకుపోయాయి. బూర్గంపాడు ఏరియాలోనూ ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. రోడ్లమీ పలు చోట్ల భారీ వృక్షాలు పడిపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement