చెన్నైలో రానున్న 48గంటల్లో అతి భారీ వర్షాలు కురవనున్నాయి. వరదలపై అధికారులతో సీఎం స్టాలిన్ సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని స్టాలిన్ ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలు తమిళనాడుని వణికిస్తున్నాయి. జలదిగ్భంధనలో వందలాది కాలనీలు చిక్కుకున్నాయి. కన్యాకుమారి,కాంచీపురం, మధురైలో జోరువాన కురుస్తోంది. విద్యుత్ తో నడిచే లోకల్ రైళ్ళను రద్దు చేసింది రైల్వేశాఖ. భారీ వర్షాలకు నిండుకుండలా మారాయి చంబారపాకం,పుయల్ రిజర్వాయర్లు. డ్యాం గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయనున్నారు అధికారులు.
Advertisement
తాజా వార్తలు
Advertisement