రానున్న 24గంటల్లో ఒడిశా..అండమాన్ నికోబార్ దీవులు.. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ మరో ఐదు రోజుల పాటు హెచ్చరికను విడుదల చేసింది. ఆగ్నేయ- దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం-అండమాన్ సముద్రం మీదుగా చదునుగా వాతావరణం ఉంటుందనీ, ఈ సమయంలో 40-45 kmph నుండి 55 kmph వరకు వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. నైరుతి అరేబియా సముద్రం, సోమాలియా తీరం, గల్ఫ్ ఆఫ్ మన్నార్, దక్షిణ తమిళనాడు, శ్రీలంక తీరం, ఆగ్నేయ, దానిని ఆనుకుని నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో నైరుతి అరేబియా సముద్రం మీదుగా గంటకు 45-55 కి.మీ నుండి 65 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు బయటకు వెళ్లవద్దని ఐఎండీ ఒక ప్రకటనలో పేర్కొంది.
గంగా నది పశ్చిమ బెంగాల్, ఒడిశా, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో ఆదివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం నాడు, ఆగ్నేయ, దానిని ఆనుకుని ఉన్న నైరుతి, తూర్పు-మధ్య బంగాళాఖాతం మీదుగా (గాలుల వేగం 40-45 kmph నుండి 55 kmph వరకు) చాలా ఎక్కువగా గాలుల తీవ్రత ఉంటుందని తెలిపింది. సోమవారం, ఒడిశాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. జార్ఖండ్, గంగానది ప్రాంత పశ్చిమ బెంగాల్, ఒడిశా, అండమాన్- నికోబార్ దీవులు, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐంఎడీ తెలిపింది. మంగళవారం, తూర్పు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉప-హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఒడిశాతో పాటు బీహార్, జార్ఖండ్, గంగా పశ్చిమ బెంగాల్, అండమాన్-నికోబార్ దీవులు, అస్సాం, మేఘాలయలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బుధవారం, తూర్పు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉప-హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఒడిశాలతో పాటు ఉత్తరాఖండ్, ఉత్తర ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, గంగా ప్రాంత పశ్చిమ బెంగాల్, అండమాన్-నికోబార్ దీవులు, అస్సాం, మేఘాలయలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.