భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రంలో రాత్రి నుండి ఉరుములతో మెరుపులతో కూడిన వర్షం పడింది. దీంతో వరి ధాన్యం, మొక్కజొన్న తడిసి ముద్దాయి అయ్యాయి. అకాల వర్షంతో అన్నదాతకు కష్టాలు మొదలయ్యాయి. పంటలు భారీగా దెబ్బతిన్నాయి. అకాల వర్షంతో రైతులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. ఉరుములతో కూడిన వర్షం పడడంతో టేకుమట్ల మండలంలోని వరి ధాన్యం మొక్కజొన్న తదితర పంటలు దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement